ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పెన్షనర్లకు భారీ షాక్! 18 వేల మందికి పెన్షన్ కట్!

Header Banner

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పెన్షనర్లకు భారీ షాక్! 18 వేల మందికి పెన్షన్ కట్!

  Sat Feb 01, 2025 08:50        Politics

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకి సంబంధించి పెన్షన్ల పంపిణీ ప్రారంభించింది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను ఇస్తున్నారు. రేపు ఆదివారం కావడంతో.. ఈ రోజే 100 శాతం పంపిణీ పూర్తవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఒకవేళ ఇవాళ ఎవరికైనా పెన్షన్ రాకపోతే.. సోమవారం ఇచ్చేలా ప్లాన్ ఉంది. అలా జరగకుండా.. మధ్యాహ్నానికే పంపిణీ పూర్తవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అందువల్ల ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు పరుగులు పెడుతున్నారు. 

 

జనవరి నెలలో ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను పునఃపరిశీలించింది. అర్హత లేని వారు అంటే.. వైకల్యం లేని వారు కూడా ఉన్నట్లుగా బోగస్ సర్టిఫికెట్లు పెట్టి.. పెన్షన్ తీసుకుంటున్నారని అధికారులు తేల్చడంతో.. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా వైకల్య పరీక్షలు జరిపిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. అలాగే.. చనిపోయిన వారి పేర్లను కూడా తొలగించారు. ఇలా ఒక్క జనవరి నెలలోనే 18036 మంది పేర్లను జాబితా నుంచి తీసేశారు. 

 

ప్రభుత్వం జనవరిలో 63,77,943 మందికి పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ.. ఫిబ్రవరికి వచ్చేసరికి.. లబ్దిదారుల సంఖ్య 63,59,907 మాత్రమే ఉంది. అంటే.. 18,036 పేర్లను తొలగించినట్లు లెక్క. వారంతా ఎవరు? ఏయే జిల్లాల్లో ఉన్నారు అనేది తేలాల్సిన అంశం. అందువల్ల ఇవాళ ఎవరికి పెన్షన్ వస్తుందో, ఎవరికి రాదో చెప్పలేని పరిస్థితి. పరీక్షలు జరిపిన వారిలో కొందరికి పెన్షన్ రాదు అనుకోవచ్చు. జనవరిలో జాబితాలో పేరు ఉన్నా, రకరకాల కారణాలతో 96,427 మందికి పెన్షన్ రాలేదు. ఫిబ్రవరిలో ఎంత మంది లిస్టులో పేరు ఉన్నవారికి రాకుండా పోతుందో మున్ముందు తెలుస్తుంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. కొత్తగా ఎవరైనా దరఖాస్తు పెట్టుకుందామంటే.. ఛాన్స్ లేదు. కానీ.. ఉన్న లిస్టు నుంచి అనర్హులను తొలగిస్తోంది. అనర్హుల పేర్లను తప్పించడం తప్పేమీ కాదు. ఐతే.. కొత్త వారికి పెన్షన్ ఇచ్చే అవకాశం కల్పించాలి. వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. తద్వారా కొత్త అర్హులు.. నెల నెలా పెన్షన్ పొందేందుకు వీలవుతుంది. 

 

పెన్షన్ల పంపిణీ తర్వాత సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం నుంచి IVRS సర్వే చేపట్టబోతున్నారు. ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం. ఇది లబ్దిదారులకు ఫోన్ కాల్ రూపంలో వెళ్తుంది. ఇందులో మీకు పెన్షన్ వచ్చిందా? వస్తే 1 నొక్కండి, రాకపోతే 2 నొక్కండి అని వాయిస్ కాల్ వినిపిస్తుంది. తద్వారా పెన్షన్ వచ్చిన వారు 1, రాని వారు 2 నొక్కుతారు. దాంతో.. ఎంత మందికి పెన్షన్ వచ్చిందో తెలిసిపోతుంది. అలాగే.. IVRSలో మరో కాల్ కూడా ఉంటుంది. అందులో.. సచివాలయ ఉద్యోగి మీకు పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారా? లేదా? అని ప్రశ్నిస్తారు. ఇంటికి వచ్చి ఇస్తే 1, ఇంటికి రాకుండా ఇస్తే 2 నొక్కండి అని ఉంటుంది. 

 

పెన్షన్ ఇచ్చేటప్పుడు సచివాలయ ఉద్యోగి లంచం తీసుకున్నారా అనే సర్వే కూడా ఉంటుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరైనా లంచం తీసుకున్నట్లు తేలితే, వారిపై చర్యలుంటాయని చెప్పారు. అందువల్ల ఈసారి IVRS సర్వే సచివాలయ ఉద్యోగులకు టెన్షన్ తెప్పిస్తోంది. ఎందుకంటే.. కొంతమంది ఉద్యోగులు.. ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వకుండా.. లబ్దిదారులనే తమ దగ్గరకు రప్పించుకుంటున్నారు. అలాంటి ఉద్యోగులను సీఎం GPS ట్రాకింగ్ చెయ్యబోతున్నారు. వారు ఇళ్లకు వెళ్లిందీ, లేనిదీ జీపీఎస్ చెప్పేస్తుంది. ఇళ్లకు వెళ్లకపోతే, చర్యలు తప్పవు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP